సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 10, 2020 , 11:37:29

రెండో రోజు 358 నామినేషన్లు

రెండో రోజు 358 నామినేషన్లు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో రెండోరోజు గురువారం నామినేషన్ల పర్వం కోలాహలం సాగింది. 7మున్సిపాలిటీల్లో 324 మంది అభ్యర్థులు 358 నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు 118 మంది అభ్యర్థులు122 నామినేషన్లు వేసిన విషయం విధితమే. రెండురోజుల్లో మొత్తంగా 442 మంది అభ్యర్థులు 480 నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. రెండో రోజు అత్యధికంగా టీఆర్‌ఎస్ నుంచి 131 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు నేడు బీ-ఫారాలతో మరోసెట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

7 మున్సిపాలిటీల్లో 358 నామినేషన్లు...
నల్లగొండ, మిర్యాలగూడ, నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీల్లో 162 వార్డులుండగా ఆయా వార్డుల్లో ఈ నెల 22న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ఈ నెల 7న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా 8నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు ఏడు మున్సిపాలిటీల్లో 118 మంది అభ్యర్థులు 122 నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు గురువారం 324మంది అభ్యర్థులు 358 నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 442మంది అభ్యర్థులు 480 నామినేషన్లను దాఖలు చేశారు.

అత్యధికంగా టీఆర్‌ఎస్ నుంచే...
జిల్లావ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు 15సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా మిర్యాలగూడలో 38, నందికొండలో 11, హాలియాలో 18, చండూరులో 17, చిట్యాలలో 7, దేవరకొండలో 25 దాఖలయ్యాయి. ఇక కాంగ్రెస్ నుంచి మొత్తంగా ఆయా పార్టీల నుంచి నల్లగొండలో 64 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేయగా మిర్యాలగూడలో 63 మంది 74 సెట్లు నందికొండలో 26 మంది 26 సెట్లు, హాలియాలో 35 మంది 36 సెట్లు, చండూరులో 25 మంది 42 సెట్లు, చిట్యాలలో 23 మంది 23 సెట్లు, దేవరకొండలో 88 మంది 88 సెట్లు దాఖలు చేశారు.

నామినేషన్లకు నేడే చివరి తేదీ..
ఈ నెల 8 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా నేడు ముగియనుంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి అభ్యరులను పూర్తిస్థాయిలో ప్రకటించ లేదు. నేడు అభ్యర్థుల ప్రకటనతోపాటు నామినేషన్లు సైతం దాఖలయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ గురువారం ఆయా నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వగా వాటితో నేడు నామినేషన్లు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండడంతో నేడు భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయ్లి


logo