మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 10, 2020 , 11:35:59

నీరు-పరిశుభ్రతపై అవగాహన అవసరం

నీరు-పరిశుభ్రతపై అవగాహన అవసరం

నల్లగొండ విద్యావిభాగం : ప్రతి జీవ రాశికి నీరు ఎంతో అవసరమని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంద ని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. ఎం.యాదగిరి సూచించారు. నల్లగొండలోని ఎంజీయూలో గురువారం మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్(ఎంజీఎన్‌సీఆర్‌ఈ) ఆధ్వర్యంలో నీరు-పరిశుభ్రత అనే అంశంపై ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే సందర్భంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, పీఓలు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎంజీఎన్‌సీఆర్‌ఈ ప్రాజెక్టు డైరెక్టర్ బి. ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల్లో నీటి వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు నీటి వనరుల లభ్యతను తెలియజేయాలన్నారు. అనంతరం ఎంఓయూ చేశారు. ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. దోమల రమేశ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు, ఎంజీఎన్‌సీఆర్‌ఈ పరిశోధన విద్యార్థి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.


logo