e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home నల్గొండ అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధి

అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధి

అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధి

శాలిగౌరారం, జూలై 13 : సమష్టి కృషితో గ్రామాలను అన్ని రంగాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుందామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో 24గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం పల్లెలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారి నుంచి గ్రామ ప్రజాప్రతినిధి వరకు నిత్యం గ్రామాల్లో పర్యటించి సమస్యలను, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 11నుంచి సాయంత్రం 6గంటల వరకు గ్రామాల వారీగా రివ్యూ నిర్వహించి గ్రామానికి రూ.20లక్షల నుంచి 30లక్షల వరకు నిధులు కేటాయించారు. అంతకు ముందు 1వ వార్డులో రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాలిశెట్టిగూడెంలో స్థానిక సర్పంచ్‌ బట్ట హరితవీరబాబు అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ దిమ్మె, జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి జై తెలంగాణ, జై టీఆర్‌ఎస్‌ అంటూ నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీల, వైస్‌ ఎంపీపీ కందుల అనిత, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ కట్టా లక్ష్మీవెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మెన్‌ తాళ్లూరి మురళి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌, గుండా శ్రీనివాస్‌, సర్పంచ్‌ బట్ట హరిత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్‌, కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య, చాడ హతీష్‌రెడ్డి, గంట శంకర్‌, ఏమిరెడ్డి నర్సిరెడ్డి, నిమ్మల సురేశ్‌గౌడ్‌, గుజిలాల్‌ శేఖర్‌బాబు, కొన్‌రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, కల్లూరి నాగరాజుగౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధి
అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధి
అంచెలంచెలుగా గ్రామాల అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement