సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 22, 2020 , 03:26:03

మేళ్లచెర్వు శివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు

మేళ్లచెర్వు శివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని శ్రీస్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితెపాటు పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం రాత్రి సందర్శించారు.

మేళ్లచెర్వు : సూర్యాపేట జిల్లా  మేళ్లచెర్వులోని శ్రీస్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితెపాటు పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం రాత్రి సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించి ఆలయ ప్రాశస్త్యాన్ని  వివరించి స్వామివారి ప్రసాదాన్ని  అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి మంత్రితోపాటు ప్రజాప్రతినిధులను శాలువాలతో సన్మానించారు.  అనంతరం జాతర సందర్భంగా ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను,  విద్యుత్‌ ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలను మంత్రి జగదీశ్‌రెడ్డి  ప్రారంభించారు.  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ పాడిపంటలతో, సుభిక్షంగా ఉండేలా మేళ్లచెర్వు శివయ్యను కోరుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు జోగిపల్లి సంతోశ్‌కుమార్‌ తెలిపారు.  కలెక్టర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.  ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు  బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు పాల్గొన్నారు. 


logo