e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home నల్గొండ హరిత కానుక

హరిత కానుక

హరిత కానుక

మునుగోడు, జూలై 18 : రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలోని ఆయా మండలాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మునుగోడు మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి కేక్‌ కట్‌ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అనునిత్యం కృషిచేస్తున్న గొప్ప నాయకుడు మంత్రి జగదీశ్‌రెడ్డి అని ప్రశంసించారు. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఏరుకొండ శ్రీను, రావిరాల కుమారస్వామి, దొడ్డి రామకృష్ణ, శంకర్‌రెడ్డి, జలంధర్‌, నాగరాజు, శరత్‌బాబు పాల్గొన్నారు.

శాలిగౌరారంలో స్వీట్ల పంపిణీ..
శాలిగౌరారం : టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సబ్‌స్టేషన్‌లో మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్‌, కట్టా వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తాళ్ళూరి మురళి, మామిడి సర్వయ్య, గుజిలాల్‌ శేఖర్‌బాబు, గంట శంకర్‌, మురారిశెట్టి కృష్ణమూర్తి, గౌర వీరయ్య, బండారు శంకరయ్య, దాసరి వెంకన్న, పడాల సత్తయ్య, రాజు, కల్లూరి లింగయ్య పాల్గొన్నారు.

- Advertisement -

కేతేపల్లిలో..
కేతేపల్లి : మండల నాయకులు సూర్యాపేటకు వెళ్లి మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా గ్రామాల్లో జరిగిన వేడుకల్లో సర్పంచులు బి.శ్రీనివాస్‌యాదవ్‌, కొండ సరితాసైదులుగౌడ్‌, బచ్చు జానకిరాములు, కట్టా శ్రవణ్‌కుమార్‌, ఉపసర్పంచులు తండు రాములుగౌడ్‌, ఆర్‌.సైదులుగౌడ్‌, నాయకులు ఎం.వెంకట్‌రెడ్డి, సీహెచ్‌ వెంకన్న, కె.ప్రదీప్‌రెడ్డి, వి.చేతన్‌, డి.సుధాకర్‌ పాల్గొన్నారు.

గుర్రంపోడులో..
గుర్రంపోడు : మండల కేంద్రంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, నగేశ్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

దేవరకొండలో..
దేవరకొండ : పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ లక్ష్మమ్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..
హాలియా : హాలియాలోని రైస్‌మిల్లుల్లో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఎస్‌ఐ శివకుమార్‌, నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, రావుల రాంబాబు యాదవ్‌, నల్లగొండ సుధాకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రిక్కల మధుసూదన్‌రెడ్డి, బాలకృష్ణ, ఈదయ్య పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హరిత కానుక
హరిత కానుక
హరిత కానుక

ట్రెండింగ్‌

Advertisement