e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home నల్గొండ మొబైల్‌ ఏటీఎంలను ఉపయోగించుకోవాలి

మొబైల్‌ ఏటీఎంలను ఉపయోగించుకోవాలి

మొబైల్‌ ఏటీఎంలను ఉపయోగించుకోవాలి
  • నాబార్డు సహకారంతోరైతులకు మరిన్ని సేవలు
  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి,డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

నల్లగొండ, జూలై 19 : రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోని గ్రామాల్లో వారికి మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో స హకార బ్యాంకు సంచార (మొబైల్‌) ఏటీఎంను అందుబాటు లో తీసుకురావటం మంచి పరిణామమని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నాబార్డు సహకారంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అందు బాటులోకి తెచ్చిన మొబైల్‌ ఏటీఎంను హైదరాబాద్‌లోని మి నిస్టర్‌ క్వార్టర్స్‌లో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి మాట్లా డుతూ ఇప్పటికే సహకార బ్యాంకు ఆధ్వర్యంలో మొబైల్‌ ఏటీ ఎం ప్రారంభించి సేవలు అందిస్తున్నామని ఆ సేవలు విస్తరిం చాలనే ఉద్దేశం తోనే మరో ఏటీఎంను అందుబాటులోనికి తీ సుకొస్తున్నట్లు తెలిపారు. నాబార్డు వారి సహకారంతో ఈ సేవ లు అందిస్తున్నామని అంతేకాక ఇప్పటికే నాబార్డు ద్వారా పీఏ సీఎస్‌ల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినట్టు తెలిపా రు. సూర్యాపేట యాదాద్రి జిల్లాల వారికి ఈ ఏటీఎం సేవలు వినియోగించబడుతాయన్నారు. ఇందులో అన్ని రకాల బ్యాం కు కార్డులు ఉపయోగించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ఎసిరెడ్డి దయాకర్‌ రెడ్డి, డైరెక్టర్‌ లింగంయాదవ్‌, ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ శ్రావణ్‌, సీఈవో మదన్‌మోహన్‌, ఏజీఎం ఉదయశ్రీ, మేనేజర్‌ సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మొబైల్‌ ఏటీఎంలను ఉపయోగించుకోవాలి
మొబైల్‌ ఏటీఎంలను ఉపయోగించుకోవాలి
మొబైల్‌ ఏటీఎంలను ఉపయోగించుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement