e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home నల్గొండ మినీ పార్కుల స్థాయిలో బృహత్‌ వనాలు

మినీ పార్కుల స్థాయిలో బృహత్‌ వనాలు

మినీ పార్కుల స్థాయిలో బృహత్‌ వనాలు

దామరచర్ల, జూలై 14 :గ్రామాల్లో ఏర్పాటు చేసే బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు మినీ పార్కుల స్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. బుధవారం మండలంలోని నూనావత్‌ తండాలో ఆయన పర్యటించి పది ఎకరాల భూమిలో 32 వేల మొక్కలు నాటాలన్నారు. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, తాసీల్దార్‌ ప్రమీల పాల్గొన్నారు.

మిర్యాలగూడ రూరల్‌ : మండలంలోని కొత్తగూడెం, లక్ష్మీపురం, గూడూరు గ్రామాల్లో అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారి వెంట కలెక్టర్‌ మొక్కలను పరిశీలించారు. రోడ్డు వెంట రెండో వరుస మొక్కలను నాటాలని సూచించారు. పంచాయతీరాజ్‌ జిల్లా అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఎంపీడీఓ అజ్మీర దేవిక, తాసీల్దార్‌ గణేశ్‌ పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : మండల కేంద్రంలోని ఫారెస్ట్‌ సర్వే నంబరు 462లో 10 ఎకరాల భూమిని పరిశీలించి బృహత్‌ పల్లె పకృతి వనానికి కేటాయించారు. ఎంపీడీఓ మసూద్‌ షరీఫ్‌, తాసీల్దార్‌ రఘు, ఆర్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : మండలంలోని అద్దంకి -నార్కట్‌పల్లి రహదారి పక్కన మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. కుక్కడం, మాడ్గులపల్లి, కొత్తగూడెంలో మొక్కలకు రక్షణ ఏర్పాటు చేయాలన్నారు. తాసీల్దార్‌ అర్చన, ఎంపీడీఓ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నిడమనూరు : మండలంలోని నిడమనూరు, ముప్పారం, సోమోరిగూడెం, వేంపాడు, వెంగన్నగూడెం, బొక్కమంతలపహాడ్‌ గ్రామాల్లో రహదారుల వెంట హరితహారం మొక్కలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, తాసీల్దార్‌ రాజు, ఎంపీడీఓ ప్రమోద్‌ కుమార్‌, ఎంపీఓ రామలింగయ్య, బొల్లం రవియాదవ్‌ పాల్గొన్నారు.
హాలియా : అనుముల మండలం రామడుగులో బృహత్‌ పల్లె ప్రకృతివనం ఏర్పాటుకు కలెక్టర్‌ స్థలాన్ని పరిశీలించారు. తాసీల్దార్‌ లావూరి మంగ, ఎంపీడీఓ లక్ష్మి పాల్గొన్నారు.
త్రిపురారం : మండలంలోని రాగడపలో సర్వే నంబర్‌ 67లో బృహత్‌ మెగా పల్లెప్రకృతివనం ఏర్పాటుకు స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అనువైనస్థలం దొరికిందని, జిల్లాలో మోడల్‌ విలేజ్‌గా తయారు చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్‌రెడ్డి, తాసీల్దార్‌ ప్రమీల, ఎంపీడీఓ అలివేలుమంగమ్మ, జడ్పీటీసీ భారతీభాస్కర్‌నాయక్‌ పాల్గొన్నారు.
వేములపల్లి : మండలంలోని శెట్టిపాలెంలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి వెంట నాటిన మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. సల్కునూరులో సర్వే నంబర్‌ 448లో మెగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాసీల్దార్‌ వెంకటేశం, ఇన్‌చార్జి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ సాయి, ఏపీఎం మిరాజుద్దీన్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మినీ పార్కుల స్థాయిలో బృహత్‌ వనాలు
మినీ పార్కుల స్థాయిలో బృహత్‌ వనాలు
మినీ పార్కుల స్థాయిలో బృహత్‌ వనాలు

ట్రెండింగ్‌

Advertisement