e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home నల్గొండ ‘బృహత్‌ వనాల’తో పర్యావరణ సమతుల్యత

‘బృహత్‌ వనాల’తో పర్యావరణ సమతుల్యత

‘బృహత్‌ వనాల’తో పర్యావరణ సమతుల్యత

కట్టంగూర్‌/నార్కట్‌పల్లి/శాలిగౌరారం/నల్లగొండ రూరల్‌/ వేములపల్లి, జూలై 16: గ్రామాల్లో పర్యావరణ సమతుల్యత కోసం బృహత్‌ ప్రకృతి వనాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కలెక్టర్‌ శుక్రవారం నల్లగొండ, నార్కట్‌పల్లి, కట్టంగూర్‌, శాలిగౌరారం, వేములపల్లి మండలాల్లో కలెక్టర్‌ పర్యటించి బృహత్‌ వనాల స్థలాలను పరిశీలించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌ కింద 9ఎకరాల ప్రభుత్వ భూమిని బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమంగా చేపట్టిందని, విరివిగా మొక్కలు నాటి 33శాతం అడవులు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.

నార్కట్‌పల్లిలోఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు చిరుమర్తి యాదయ్య, ముత్తయ్య, సర్పంచ్‌ యానాల మాధవి, కట్టంగూర్‌లో జడ్పీటీసీ తరాల బలరాములు, తాసీల్దార్‌ ఇంద్రపల్లి హుస్సేన్‌, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, సర్పంచ్‌లు వడ్డె సైదిరెడ్డి, గుర్రం సైదులు, సుంకరబోయిన వెంకన్న, శాలిగౌరారంలో సర్పంచ్‌లు దండ రేణుకాఅశోక్‌రెడ్డి, అల్లి సైదులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తాళ్లూరి మురళి, ఆర్‌ఐ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. అన్నెపర్తిలో ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి, తాసీల్దార్‌ నాగార్జునరెడ్డి, ఎంపీఓ మాధవరెడ్డి, సర్పంచ్‌ మేకల అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘బృహత్‌ వనాల’తో పర్యావరణ సమతుల్యత
‘బృహత్‌ వనాల’తో పర్యావరణ సమతుల్యత
‘బృహత్‌ వనాల’తో పర్యావరణ సమతుల్యత

ట్రెండింగ్‌

Advertisement