e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home నల్గొండ బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి

బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి

బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి

కేతేపల్లి, జూలై 20 : బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను సమర్ధవంతంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీఓ కాళిందిని ఆదేశించారు. మండలంలోని బొప్పారం గ్రామంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో మొత్తం 30వేల మొక్కలు నాటాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు నిత్యం పనులను పర్యవేక్షించాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె వెంట ఎంపీపీ శేఖర్‌, ఎంపీడీఓ భవాని, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ కె.రామ్మోహన్‌, ఏపీఎం యాదమ్మ, టీఏలు సైఫుద్దీన్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ఎంపీడీఓ
నల్లగొండ రూరల్‌ : మండలంలోని కొత్తపల్లిలో బృహత్‌ పల్లె ప్రకృతి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఐదెకరాల్లో నిర్మించనున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం స్థలం, జి.చెన్నారంలో ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీఓ మాధవరెడ్డి, సర్పంచులు రొమ్ముల నాగయ్య, ఉప్పునూతల వెంకన్న యాదవ్‌, పంచాయతీ కార్యదర్శి సరిత, ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -

ప్రకృతి వనంలో 40వేల మొక్కలు..:ఎంపీడీఓ యాకూబ్‌ నాయక్‌
మునుగోడు : మండలంలోని కొరటికల్‌లో ఏర్పాటు చేయనున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో 40వేల మొక్కలు నాటనున్నట్లు ఎంపీడీఓ యాకూబ్‌ నాయక్‌ వెల్లడించారు. మంగళవారం ఆ గ్రామంలోని సర్వే నంబర్‌ 523లో కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని చదును చేయించి కంచె ఏర్పాటు చేయించారు. ఆయన వెంట సర్పంచ్‌ వల్లూరి పద్మ, ఏపీఓ శ్రీనయ్య, గిర్ధావర్‌ శ్రీనునాయక్‌, పంచాయతీ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.వెంకటేశ్వర్లు, వీఆర్‌ఓ చంద్రయ్య, వల్లూరి లింగయ్య ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి
బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి
బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement