e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home నల్గొండ పైలేరియా, నులిపురుగులకు చెక్‌

పైలేరియా, నులిపురుగులకు చెక్‌

పైలేరియా, నులిపురుగులకు చెక్‌

తిరుమలగిరి, జూలై 13:బోదకాలు (పైలేరియా) నులిపురుగుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. ఈ నెల 15నుంచి 17వరకు జిల్లా వ్యాప్తంగా 2నుంచి 15ఏండ్లలోపు పిల్లలకు డీఈసీ మాత్రలతో పాటు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీకి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు జిల్లాలో 10,39,211మంది అర్హులను గుర్తించగా 4440మంది సిబ్బందితో పాటు 462మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఇప్పటికే ఎన్‌వీబీడీసీపీ (జాతీయ కీటక జనిత నివారణ కార్యక్రమంలో భాగంగా) ఢిల్లీ సెంట్రల్‌ టీమ్‌ సభ్యుడు జయరామ్‌ పరాస మోతె, సిరికొండ, నాగారం, అర్వపల్లి మండలాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి ముందస్తు చర్యలను పరిశీలిస్తున్నారు.


  • 2నుంచి 5సంవత్సరాల్లోపు పిల్లలు డీఈసీ 1 మాత్ర, ఆల్బెండజోల్‌ 1మాత్ర వేసుకోవాలి.
    6నుంచి 14ఏండ్లలోపు వారు డీఈసీ 2మాత్రలు, ఆల్బెండజోల్‌ 1మాత్ర వేసుకోవాలి.
    15సంవత్సరాల పైబడిన వారు డీఈసీ 3మాత్రలు, 1మాత్ర ఆల్బెండజోల్‌ వేసుకోవాల్సి ఉంటుంది.
  • పైలేరియా లక్షణాలు..
    తరచూ వచ్చే కొద్దిపాటి జ్వరం, ఆయాసం, శోషనాళాలు పాడైపోయి లింఫ్‌ ప్రసరణ ఆగిపోయి కాళ్లు, చేతులు వాపు రావడం పుండ్లు, నీరు కారడం, దురద ఉంటుంది.
    వరిబీజం, మర్మావయవాలు పాడవటం, శర్మంపై పుండ్లు కనిపిస్తాయి.
    నులిపురుగులతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం…
    నులిపురుగుల వల్ల పిల్లలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహారలోపం బారిన పడుతారు. ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి లక్షణాలు ఉంటాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు…
గోళ్లను శుభ్రంగా కత్తిరించుకోవాలి.
ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త పడాలి
బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లను ఉపయోగించాలి.
భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పిల్లలు చెప్పులు ధరించే వెళ్లేవిధంగా చూసుకోవాలి.

- Advertisement -

డీఈసీ మాత్రల ద్వారానే నివారణ సాధ్యం…
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 ,16,17 తేదీల్లో జరిగే డీఈసీ, ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వం ఉచితంగా అందించే డీఈసీ మాత్రలను వైద్య సిబ్బంది సూచనల మేరకు వినియోగించాలి. ఆహారం తీసుకున్న తర్వాత మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసేందుకు ఇంటికి వచ్చే వలంటీర్లకు ప్రజలంతా సహకరించాలి.

  • డాక్టర్‌ వాసిరెడ్డి సాహితి, మలేరియా జిల్లా అధికారి, సూర్యాపేట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పైలేరియా, నులిపురుగులకు చెక్‌
పైలేరియా, నులిపురుగులకు చెక్‌
పైలేరియా, నులిపురుగులకు చెక్‌

ట్రెండింగ్‌

Advertisement