e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home నల్గొండ తొలి ఏకాదశి వైభవం

తొలి ఏకాదశి వైభవం

తొలి ఏకాదశి వైభవం

రామగిరి, జూలై 20 : తొలి ఏకాదశి పండుగను జిల్లావ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మేనేజర్‌ రుద్ర వెంకటేశం, చైర్మన్‌ రమేశ్‌ పర్యవేక్షణలో ముక్కంటికి మహన్యాసక పూర్వ రుద్రాభిషేకాలు చేశారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. పాతబస్తీలోని శివాలయం, కామేశ్వరరావు కాలనీలోని ఉమా మహేశ్వర స్వామి ఆలయం, రామగిరిలోని కనకదుర్గ సహిత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయం, వీటీకాలనీలోని శ్రీదేవీ భూదేవీ సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు పలు శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని వేంకటేశ్వర స్వామికి వైభవంగా పూజలు సాగాయి.

పానగల్‌ ఆలయాల్లో…
నీలగిరికి తలమానికంగా ఉన్న ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాల్లో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శివుడికి అభిషేకాలు చేసేందుకు ప్రజలు బారులుదీరారు. ఉదయసముద్రంలో భక్తులు స్నానమాచరించారు.

- Advertisement -

చండూరు.. మండలంలోని తుమ్మలపల్లి రామలింగేశ్వర ఆలయం, ఘట్టుప్పల్‌ ప్రాచీన శివాలయంలో అభిషేకాలు చేశారు. లక్కినేనిగూడెం రామాలయంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దోటి సుజాతావెంకటేశ్‌యాదవ్‌ దంపతులు పూజలు చేశారు.

మర్రిగూడ.. మండల కేంద్రంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు.

మునుగోడు.. మండల కేంద్రంలోని శివరామక్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకుడు కొండోజు నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో గణపతి హోమం, రుద్రాభిషేకం, కుంకుమ పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.

కట్టంగూర్‌.. మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణస్వామి, శ్రీసాయి మణికంఠ, శివాంజనేయ దేవాలయాల్లో పూజారులు రామడుగు శ్రీనివాస్‌శర్మ, భిక్షమాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భాస్కర్‌, మీలా వేణుమాధవ్‌ పాల్గొన్నారు.

మిర్యాలగూడ.. పట్ణణంలోని చైతన్యనగర్‌ ఉమామహేశ్వర ఆలయం, పెద్దబజారు శివాలయం, రెడ్డి కాలనీ రామాలయం, హౌసింగ్‌బోర్డు వేంకటేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉమామహేశ్వర ఆలయ కమిటీ ఆధ్యక్షుడు గోపాలకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్‌, మట్టయ్య పాల్గొన్నారు.

కృష్ణానదిలో పుణ్యస్నానాలు
అడవిదేవులపల్లి : మండల కేంద్రం శివారులో ఉన్న బౌద్ధమ దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణానదిలో స్నానాలు చేసిన అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. పూజలు, అర్చనలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అర్చకుడు ఎడవల్లి రఘురామయ్య పాల్గొన్నారు.

ముని శివాలయంలో
చందంపేట : మండలంలోని దేవరచర్ల గుట్టలో ఉన్న పురాతన ముని శివాలయానికి భక్తులు పోటెత్తారు. హేమాసౌకార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ జాల నర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ ప్రేమలత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వాడపల్లిలో ప్రత్యేక పూజలు
దామరచర్ల : మండలంలోని వాడపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా, మూసీ నదుల సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. మీనాక్షీఅగస్తేశ్వర స్వామి, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ సిద్ధయ్య, ఈఓ మృత్యుంజయశాస్త్రి ఆధ్వర్యంలో భక్తులకు సదుపాయాలు కల్పించారు.
నందికొండ : నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీ శివాలయం, మార్కండేయ స్వామి ఆలయం, హిల్‌కాలనీలోని సత్యనారాయణ స్వామి, ఏళేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలి ఏకాదశి వైభవం
తొలి ఏకాదశి వైభవం
తొలి ఏకాదశి వైభవం

ట్రెండింగ్‌

Advertisement