e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home నల్గొండ కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

హాలియా, జూలై 25 : కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లవేళలా అండగా ఉం టుందని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త చినాల శ్రీనివాస్‌ కుటుంబానికి మంజూరైన రూ. 2 లక్షల బీమా చెక్కు ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. అనంతరం అనుముల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కె. జానయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 38 వేల చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని నిరుపేదల లబ్ధి కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమతీ పురుషోత్తం, మార్కెట్‌ కమిటీ గౌరవ సలహాదారుడు యడవల్లి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ నల్లబోతు వెంకటయ్య, తిరుమలగిరి సాగర్‌ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రవి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana