e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home నాగర్ కర్నూల్ పాఠశాల భవనం పనులు వారంలో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

పాఠశాల భవనం పనులు వారంలో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

 తిమ్మాజిపేట: ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న భవన సముదాయాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. సతీమణి, ట్రస్ట్ డైరక్టర్ మర్రి జమున, డీసీసీబీ డైరక్టర్ జెక్కా రఘునందన్‌రెడ్డిలతో కలసి రెండంతస్థుల భవనాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా. పనులు చివరి దశలో ఉండటంతో ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారని సంబంధిత పర్యవేక్షకులకు అడి గారు. ఈ నెల చివరి వారంలో ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంటుందని, వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. ప్రస్థు తం తరగతులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ప్రత్యామ్నాయాలు చూపి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

- Advertisement -

మైదానం మొత్తం చదును చేస్తామని, ఆధునిక క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని, విశాలమైన మైదానం చుట్టూ మొక్కలను నాటాలన్నారు. రంగుల పనులు వెంటనే పూర్తి చేయాలని, పర్నీచర్ తరగతి గదుల్లో బింగించాలన్నారు. పాఠశాలలో విద్యుత్తు పనులు పూర్తి చేయాలన్నారు.

ఆయన వెంట స్థానిక ఎంపీపీ రవీంద్ర నాథ్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్, విండో డైరక్టర్లు శ్రీరాములు, నరేందర్‌రెడ్డి, వట్టేం సర్పంచ్ అమృత్‌రెడ్డి, ఎంపీటీసీ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement