e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home నాగర్ కర్నూల్ జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతాం

జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతాం

జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతాం

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 24 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచేందుకు కృషి చేస్తామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతీబంగారయ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండు రోజులు గా నిర్వహించిన స్థాయీసంఘాల సమావేశాల్లో అభివృద్ధిపై చర్చించిన విషయాలను వివరించారు. జిల్లాలోని అ న్ని మండలాల్లో అభివృద్ధికి కావాల్సిన ప్రపోజల్స్‌ను సేకరించామని, వాటన్నింటినీ జనరల్‌ బాడీలో తీర్మానం చేశామన్నారు. జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ముందుంచేందుకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో నిధులు విడుదల చే శారని, ఆ నిధులతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అ న్ని ప్రాంతాలకు సమానంగా ని ధులు కేటాయిస్తామన్నారు. అం దుకు సభ్యులతో చర్చించామన్నా రు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ముందుకెళ్లనున్నట్లు వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి గానూ జిల్లా అభివృద్ధికి రూ.1.20 లక్షలు జనరల్‌ ఫండ్‌ నిధులు, రూ.3.45లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించామన్నారు. 2020-21 సంవత్సరానికి గానూ జిల్లా అభివృద్ధికి రూ.4కోట్ల 60లక్షలు ఖర్చు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో రూ.9 కోట్ల ఎస్‌ఎఫ్‌సీ నిధులను కేటాయించామని, వీటితో జిల్లాలోని పాఠశాలలకు రూ.4 కోట్లు, సివిల్‌ పనులకు రూ.5 కోట్లు బడ్జెట్‌లో పెట్టడం జరిగిందన్నారు. ఈ నిధులు జిల్లా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, సభ్యులు భరత్‌, కేవీఎన్‌.రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతాం
జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతాం
జిల్లాను అభివృద్ధిలో ముందుంచుతాం

ట్రెండింగ్‌

Advertisement