హన్వాడ, మే 12 : మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎంపీపీ బాలరాజు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగకు దుస్తులను పంపిణీ చేశారు. హన్వాడలో సర్పంచ్ రేవతి ఆధ్వర్యంలో సర్కారు కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ కవిత, డిప్యూ టీ తాసిల్దార్ సతీశ్‌కుమార్, కార్యదర్శి వెంకటయ్యగౌడ్ నాయకులు జంబులయ్య, సత్యం, పెంటయ్య, అంజద్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, మే 12 : మండలంలోని కౌకుంట్ల గ్రామం లో గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం వైస్ ఎంపీపీ తుమ్మలి సుజాత, సర్పంచ్ స్వప్నకిషన్రావు, ఎంపీటీసీ కిష్టన్న, ఉప సర్పంచ్ నర్సింహులు ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. చౌదర్పల్లిలో సర్పంచ్ యుగంధర్‌రెడ్డి ముస్లింలకు తోఫాను అందజేశారు. కార్యక్రమంలో మతపెద్ద షబ్బీర్ పాల్గొన్నారు.