e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు మూడు దుకాణాలపై కేసులు

మూడు దుకాణాలపై కేసులు

మూడు దుకాణాలపై కేసులు

కాలం చెల్లిన విత్తనాలు, ఫెస్టిసైడ్స్‌ పట్టివేత
దుకాణా యజమానులను రిమాండ్‌కు తరలింపు

కల్వకుర్తి, జూన్‌ 3 : పట్టణంలోని మూడు సీ డ్స్‌, ఫరిలైజర్స్‌ దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. ఎస్సీ, వ్యవసాయాధికారుల ఆదేశానుసా రం బుధవారం రాత్రి నుంచి గురువారం సా యంత్రం వరకు కల్వకుర్తి పట్టణంలోని సీడ్స్‌, ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లో వ్యవసాయ అధికారి శ్రీలత, సీఐ సైదులు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించా రు. దీప్‌ ట్రేడర్స్‌లో రూ.4.97.296 లక్షలు, వెంకటేశ్వర ట్రేడర్స్‌లో రూ.9,390, గణేశ్‌ ట్రేడర్స్‌లో రూ.17,280 విలువ గల కాలం చెల్లిన విత్తనాలు, ఫెస్టిసైడ్‌, ఫర్టిలైజర్లు గుర్తించి సీజ్‌ చేశారు. దుకాణ యజమానులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాలం చెల్లిన, కల్తి విత్తనాలు, పురుగు, రసాయన మందులు విక్రయి స్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు నమోదు
వంగూరు, జూన్‌ 3: కల్తీ పత్తి విత్తనాలను విక్రయిస్తే పీడీయాక్టు కింద కేసు నమోదు చేస్తామని ఎస్సై బాలకృష్ణ హెచ్చరించారు. గురువారం మం డలంలోని రంగాపూర్‌లోని సీడ్‌ దుకాణాన్ని ఏవో తనూజతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని అన్ని కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. అనంతరం ఎస్సై మా ట్లాడుతూ వివిధ గ్రామాల్లో లైసెన్స్‌ కలిగిన విత్తన డీలర్లు ఉన్నారని, వారితోపాటు అనధికారికంగా మరి కొంతమంది వ్యాపారం ముసుగులో కల్తీ వి త్తనాలు విక్రయించే ప్రయత్నం చేస్తే తీవ్రమైన చ ర్యలుంటాయని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై స్వప్న పాల్గొన్నారు.
ఫర్టిలైజర్‌ దుకాణాలు తనిఖీ
కోడేరు, జూన్‌ 3: మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను ఎస్సై కృష్ణ ఓబుల్‌రెడ్డి మండల వ్యవసాయాధికారి శ్రీరాం గురువారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానులు లేదా వ్యాపారులు ప్రభుత్వ అనుమతి లేని నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరగుతుందని హెచ్చరించారు. వీరి వెంట ఏఈవో మ ధుసూదన్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
తాడూరు, జూన్‌ 3 : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినా, నిల్వ చేసినా సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. విత్తనాల తనిఖీలో భా గంగా గురువారం మండలంలోని యా దిరెడ్డిపల్లి గ్రామంలో ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మోసం చేయకుండా విత్తనాలు అమ్మాలని, ఎక్కడైనా పొరపాటు జరిగితే లైసెన్సులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు విక్రయించిన వెంటనే రసీదులు చెల్లించాలన్నారు. కార్యక్రమం లో తాడూరు ఎస్సై వీరబాబుతోపాటు వ్యవసా య అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూడు దుకాణాలపై కేసులు

ట్రెండింగ్‌

Advertisement