e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి

మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి

మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి

నారాయణపేట టౌన్‌, మే 1 : చికాగో నగరంలో కార్మికులు వీరోచిత పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని, వారి పోరాట స్ఫూర్తితో కార్మిక, ఉద్యోగులు తమ హ క్కుల కోసం పారాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బా లరామ్‌ అన్నారు. మే డే సందర్భంగా శనివారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేశా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు హన్మంతు, కార్మికులు తదిత రులు పాల్గొన్నారు.
ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో…
మే డేను పురస్కరించుకొని ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద జెండావిష్కరణ చేశారు. అనంతరం పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్‌, సీపీఐ ఎం ఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు రాము మాట్లాడుతూ మే డే స్ఫూర్తితో కార్మికులు, ఉద్యోగులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐకేఎమ్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, జిల్లా సహాయ కార్యదర్శి ప్రశాంత్‌, అరుణోదయ జిల్లా కోశాధికారి అంజి, పీవైఎల్‌ జిల్లా సహా య కార్యదర్శి గణేశ్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు, భ వన నిర్మాణ కార్మికులు, ఆటో యూనియన్‌ కార్మికులు, గ్రా మ పంచాయతీ వర్కర్లు పాల్గొన్నారు.
హక్కుల కోసం సంఘటితమవ్వాలి
ఊట్కూర్‌, మే 1 : హక్కులను సాధించుకునేందుకు కా ర్మికులు సంఘటితంగా ఉద్యమించాలని ఏఐకేఎంఎస్‌ జి ల్లా అధ్యక్షుడు సలీం పిలుపునిచ్చారు. మే డే వేడుకల సందర్భంగా ఊట్కూర్‌, బిజ్వారం, అమీన్‌పూర్‌, చిన్నపొర్ల, పెద్దపొర్ల, పగిడిమర్రి, పెద్దజట్రం, అవుసలోనిపల్లి గ్రామాల్లో సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌, ఐఎఫ్‌టీ యూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు జెండాల ను ఎగురవేశారు. కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా అమలవుతున్న 4 లేబర్‌కోడ్‌లను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో…
మే డేను పురస్కరించుకుని మండలంలోని అంబేద్కర్‌ కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ బి. నారాయణ, సామాజిక కార్యకర్త నారాయణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏఐకేఎమ్‌ఎస్‌ ఆధ్వర్యంలో…
మక్తల్‌ టౌన్‌, మే 1 : కార్మికుల హక్కులు కాపాడుకుందామని ఏఐకేఎమ్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భగవంతు, సీఐటీయూ కోఆర్డినేటర్‌ గోవింద్‌రాజ్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని వ్యవసాయ సీడ్‌ గోదాం ఎదుట సీఐటీయూ మం డల కోఆర్డినేటర్‌ గోవింద్‌రాజ్‌ ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏఐకేఎమ్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భగవంతు, ఐఎఫ్‌టీయూ అనుబంధ ప్రగతిశీల యూ నియన్‌ సభ్యులు కలిసి మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కావలి వెంకటేశ్‌, నర్సింహులు, కావ లి తాయప్ప, నాగులు, చిన్న నర్సింహులు, నరేందర్‌, నవీ న్‌, ఈశ్వరయ్య, కొలిమి రాములు, శంషొద్దీన్‌, మూర్తి, వెం కటగిరి, నర్సింహులు, అశోక్‌, బాలరాజు, మారెప్ప, కృష్ణ య్య, రాజు, రామలింగప్ప, గంగన్న, జె.నర్సింహులు, బా లస్వామి, కె.బాబు, అమ్మక్క, మహేశ్వరమ్మ, ఆశన్న, నర్సి ంహులు పాల్గొన్నారు.
ధన్వాడలో ర్యాలీ
ధన్వాడ, మే 1 : ధన్వాడ, పాతపల్లి గ్రామాల్లో కార్మికు లు మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ధన్వాడ లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను అవిష్కరించి మిఠాయీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్‌ కృష్ణయ్య, పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌
ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో…
మరికల్‌, మే 1 : ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని తెలంగాణ ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఘనం గా జరుపుకొన్నారు. ఆ సంఘం నాయకులు తెలంగాణ చౌ రస్తా నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సమస్యల ను ప్రభుత్వాలు పరిష్కరించి అన్ని రకాల వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకు లు రాజేశ్వర్‌రెడ్డి, మల్లేశ్‌, వెంకటేశ్‌, శ్రీనివాసులు చంద్రారెడ్డి పాల్గొన్నారు.
సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో…
నర్వ, మే 1 : ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని మండలంలో ఘనంగా నిర్వహించారు. నాగిరెడ్డిపల్లిలో సీఐటీ యూ జిల్లా నాయకుడు కాశీనాథ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌ జెండాను ఎగురవేసి మే డే వేడుకను నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, ఆంజనేయులు, కిట్టు, వెంకటన్న పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో …
జడ్చర్ల టౌన్‌, మే 1 : కార్మికుల దినోత్సవం సందర్భం గా జడ్చర్లలో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఘ నంగా మే డే వేడుకలను నిర్వహించారు. మార్కెట్‌ యార్డు లో వెంకటేశ్వరగంజ్‌ హమాలీ సంఘం నాయకులు బి.శం కర్‌, నాగభూషణం, మల్లేశ్‌, హమాలీలు కలిసి టీఆర్‌ఎస్‌కేవీ జెండాను ఆవిష్కరించారు. నాగర్‌కర్నూల్‌ రహదారిపై టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు కె.వెంకటేశ్‌గౌడ్‌, హ మాలీ సంఘం అధ్యక్షుడు నాగయ్య, రైస్‌మిల్‌ కార్మికులు జెండాను ఎగురవేశారు. బూరెడ్డిపల్లిలోని ఎస్‌డబ్ల్యూసీ గో దాం వద్ద హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఆంజనేయులు జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌ డ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, కార్మికుల పక్షపా తి సీఎం కేసీఆర్‌ అన్నారు. మున్సిపల్‌, విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు రెగ్యూలరైజ్‌ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అ న్నారు. అలాగే ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచారని గుర్తు చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రై వేట్‌ ఉపాధ్యాయులకు ప్రతినెలా 25 కేజీల బియ్యంతోపా టు రూ.2 వేల నగదు అందించారన్నారు. కార్యక్రమంలో బాదేపల్లి సింగిల్‌ విండో డైరెక్టర్‌ గుండప్ప, టీఆర్‌ఎస్‌ నా యకులు పాల్గొన్నారు.
కార్మికులు హక్కులను సాధించుకోవాలి
హన్వాడ, మే 1 : ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మండలంలోని కొత్తపేట, మునిమోక్షం, హన్వాడ గ్రామాల్లో కార్మికుల జెండాను ఎగురవేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కులను సా ధించుకునేందుకు ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు చెన్నయ్య, ల క్ష్మయ్య, తిరుమలయ్య, అంజిలయ్య, డబ్బా రాములు, వెంకటయ్య, రాములు పాల్గొన్నారు.
కార్మికుల అభివృద్ధికి కృషి చేయాలి
కోయిలకొండ, మే 1 : కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షుడు తిరుమలయ్య కోరాడు. కార్మికుల దినోత్సవం సందర్భంగా మండలంలో జెండావిష్కరణ చేశారు. మండలంలోని తిర్మలంపల్లి, ఇబ్రహీంనగర్‌లో కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చాకలి వీరేశ్‌, వీరన్న, చెన్నయ్య, భీమయ్య, తిరుపతయ్య, యాదయ్య, సత్తయ్య, రాఘవులు, రాములు పాల్గొన్నారు.
జెండావిష్కరణ
రాజాపూర్‌, మే 1 : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వాహించారు. కార్మిక నాయకుడు దీప్లానాయక్‌ జెండావిష్కరించారు. మండలంలోని గుండ్లపోట్లపల్లిలో జీటీఎన్‌ ఇంజినీరింగ్‌ ఇండియా పరిశ్రమ గేట్‌ ఎదు ట కార్మికులు జెండాను ఎగురవేశారు. కార్మికులకు సీఐటీ యూ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో…
బాలానగర్‌, మే 1 : మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మం డలంలోని చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 1 : మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్‌అలీ కో రారు. మే డేను పురస్కరించుకొని మున్సిపాలిటీ ఆవరణ లో కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కా ర్మిక నాయకులు కురుమూర్తి, కిల్లే గోపాల్‌, ఎర్ర నర్సింహు లు, బాలరాజు పాల్గొన్నారు.
ఎదిరలో..
టీఎఫ్‌టీయూ ఆటో యూనియన్‌ ఆధ్వరంలో ఎదిర 4 వ వార్డులో మే డేను పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైజరర్‌ వెంకటేశ్‌, వార్డు కౌన్సిలర్‌ యాదమ్మ, హన్మంతు, పెద్ద కృష్ణ, బి.శ్రీనివాసు లు, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు ఏ.శ్రీనివాసులు, కార్యదర్శి శివకృష్ణ, వెంకటయ్య, శివశంకర్‌, బాలస్వామి, శ్రీశై లం, గోపాల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.
కార్మికులకు సన్మానం
కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 47వ వార్డు లో వీరహనుమాన్‌ యువజన సంఘం అధ్యక్షుడు హరికృ ష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులను సన్మానించారు. కా ర్మికుల చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వా ర్డు జవాన్‌, కార్మికులు పాల్గొన్నారు.
కేంద్రం విఫలమైందని నిరసన
మూసాపేట (అడ్డాకుల), మే 1 : కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అడ్డాకుల బస్టాండ్‌ ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దేశ వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వాలని, ప్రతి గ్రామంలో కరోనా టెస్టులు పెం చాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఎం.జీవరత్నం, కార్యదర్శి ఎం.నవీన్‌, ఎం.ప్రశాంత్‌, సహాయ కార్యదర్శి ఎం.రాజు, యువకులు పాల్గొన్నారు.
భూత్పూర్‌ చౌరస్తాలో…
భూత్పూర్‌, మే 1 : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ శా ఖ అధ్యక్షుడు శ్రీనివాసులు, మహేందర్‌, నారాయణ, వెం కటేశ్‌, రాఘవేందర్‌, రవి, సేవ్యానాయక్‌ పాల్గొన్నారు.
మాస్కులు, శానిటైజర్లు పంపిణీ
దేవరకద్ర రూరల్‌, మే 1 : చిన్న చింతకుంట మండలంలోని దమగ్నాపూర్‌లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సామాజికవేత్త వెంకటేశ్‌ గ్రామంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరో నా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పారిశుధ్య పనులు చేస్తున్నారన్నారు. వారి సే వలు వెల కట్టలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేందర్‌, బాబు, మణ్యం, మహేశ్‌, చెన్నయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి

ట్రెండింగ్‌

Advertisement