కొల్లాపూర్ రూరల్: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొల్లాపూ ర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ పంక్షన్ హాలులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డీవో హనుమానాయక్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ టీఆర్ఎస్ నాయకులు పెద్దకొత్తపల్లి మాజీ జడ్పీటీసీ కట్టా రాజేందర్ గౌడ్, పెద్ద కొత్తపల్లి మాజీ ఎంపీపీలు, వెంకటేశ్వర్రావు, శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ జక్కుల నరసింహా, కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి, రాముడు, గాలి యాదవ్, పలువురు టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.