సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సినిమా సింగం 2. ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తయ్యాయి. యముడు సినిమా వచ్చిన మూడేళ్ళ తర్వాత పార్ట్ 2 వచ్చింది. తొలి భాగం ఎక్కడ ముగించాడో.. అక్కడ్నుంచే రెండో భాగం మొదలు పెట్టాడు దర్శకుడు హరి. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. యముడుతో పోలిస్తే కాస్త తక్కువ వసూళ్ళే వచ్చినా కూడా సూర్యకు సరైన సమయంలో వచ్చిన విజయం ఇది. అనుష్క శెట్టి, హన్సిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ముఖేష్ రుషి, రెహమాన్ విలనిజం హైలైట్ గా నిలిచింది. 2013, జులై 5న విడుదలైన సింగం 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
నైజాం: 3.45 కోట్లు
సీడెడ్: 1.98 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.34 కోట్లు
ఈస్ట్: 0.69 కోట్లు
వెస్ట్: 0.51 కోట్లు
గుంటూరు: 0.92 కోట్లు
కృష్ణా: 0.72 కోట్లు
నెల్లూరు: 0.49 కోట్లు
ఏపీ + తెలంగాణ: 10.01 కోట్లు
యముడు 2 కంటే కూడా సింగం అంటేనే బాగుంటుందని ఆ టైటిల్ కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. మంచి అంచనాలతోనే విడుదలైన సింగం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 7.8 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. 10.1 కోట్ల షేర్ వసూలు చేసింది. బయ్యర్లకు 2.3 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. భారీ సినిమాలతో పోటీ పడి మరీ సింగం మంచి వసూళ్లు సాధించింది.