సోమవారం 08 మార్చి 2021
Nagarkurnool - Jan 28, 2021 , 00:10:39

అటవీ అధికారులు సహకరించాలి

అటవీ అధికారులు సహకరించాలి

  • కలెక్టర్‌ శర్మన్

అమ్రాబాద్‌, జనవరి 27: గ్రామాల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు. గ్రామాల ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు బుధవారం మన్ననూర్‌ ఐటీడీఏ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మండలంలోని మద్దిమడుగు, మల్లెలతీర్థం తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అదేవిధంగా మన్ననూర్‌లోని గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ భూమిలో నిర్మిస్తున్నారని, అడవిలోకి వెళ్లిన ప్రజలపై దాడులకు పాల్పడకుండా చూడాలన్నారు. ప్రజలపై ఎలాంటి ఒతిడి చేయొద్దని సూచించారు. ప్రజలు బాగుంటేనే అడవులు గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అఖిలేశ్‌రెడ్డి, డీఎఫ్‌వో కిష్టగౌడ్‌, ఎఫ్‌డీ రోహిత్‌, డీటీడీవో అశోక్‌, ఆర్డీవో పాండునాయక్‌, చెంచు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo