సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

- చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
కల్వకుర్తి, జనవరి 27 : సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన ప్రవీణ్‌కుమార్, చారకొండ మండలం జూపల్లికి చెందిన కమలమ్మ వైద్య సహాయం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ సహకారంతో ప్రవీణ్‌కుమార్‌కు రూ.లక్ష, కమలమ్మకు రూ.32వేలు మంజూరయ్యాయి. చెక్కులను బుధవారం హైదరాబాద్‌లో బాధితులకు నారాయణరెడ్డి అందజేశారు. తలకొండపల్లి మండలానికి చెందిన నరహరిరెడ్డి, సంతోష్ వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే సహకారంతో నరహరిరెడ్డికి రూ.90వేలు, సంతోష్‌కు రూ.36వేలు మంజూరయ్యాయి. చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధితులకు అందజేశారు. కార్యక్రమాల్లో స్వప్న, భాస్కర్‌రెడ్డి, జంగయ్య, జైపాల్‌రెడ్డి, వెంకటయ్య, నాగులు, గణేశ్, లాలయ్య, పవన్‌రెడ్డి, పాండు, రమేశ్, శివరాజ్, వెంకటేశ్, రాములు, రాములుయాదవ్, లింగంయాదవ్, రవీందర్ తదితరులు ఉన్నారు.