ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nagarkurnool - Jan 27, 2021 , 00:43:19

సౌత్‌ ఏసియా వరల్డ్‌ రన్నర్‌కు సన్మానం

సౌత్‌ ఏసియా  వరల్డ్‌ రన్నర్‌కు సన్మానం

పెద్దకొత్తపల్లి, జనవరి 26: సౌత్‌ ఏసియా వరల్డ్‌ 2020 రన్నర్‌గా నిలిచిన మండలంలోని దేవునితిర్మలాపూర్‌ గ్రామస్తుడు రోహిత్‌రాజును గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్‌ సత్యం, గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా రోహిత్‌రాజు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ సంస్థ ద్వారా గ్రామాభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తానన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి ఉన్నత చదువులు చదివిస్తే వారికి బోధన చేస్తానన్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన డాక్టరేట్‌ పొందిన రచయిత జయప్రకాశ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్రీనివాసులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌, సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు, గ్రామ రిటైర్డ్‌ హెచ్‌ఎం సుధాకర్‌ తదితరులు ఉన్నారు.


VIDEOS

logo