మంగళవారం 09 మార్చి 2021
Nagarkurnool - Jan 27, 2021 , 00:43:17

అందరూ భగీరథ నీళ్లే తాగాలి

అందరూ భగీరథ నీళ్లే తాగాలి

కందనూలు, జనవరి 26: అధికారికంగా నిర్వహించే సమావేశాల్లో ప్రతి అధికారి భగీరథ నీళ్లే తాగాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి అన్నారు. అదనపు కలెక్టర్‌ మనుచౌదరితో కలిసి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్‌ త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహారెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం ఉన్నారు.

క్రీడలతో మానసిక ప్రశాంతత

చారకొండ, జనవరి 26: క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని జెడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. జూపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి స్మారకార్థం నిర్వహించిన క్రికెట్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. మొదటి విజేత కల్వకుర్తికి వెల్దండ సింగిల్‌ విండో చైర్మన్‌ జూపల్లి భాస్కర్‌రావు రూ.12,116, రోండో బహుమతి జూపల్లికి ఎంపీపీ నిర్మలవిజేందర్‌గౌడ్‌ రూ. 8,116 నగదు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బక్కమ్మయాదవ్‌ తదితరులున్నారు.

VIDEOS

logo