ఆదివారం 07 మార్చి 2021
Nagarkurnool - Jan 27, 2021 , 00:43:17

అందరికీ అందుబాటులో సర్కారు వైద్యం

అందరికీ అందుబాటులో సర్కారు వైద్యం

  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట రూరల్‌, జనవరి 26: ప్రభుత్వ వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికే వంద పడకల దవాఖానను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల దవాఖానను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ బ్యాలెన్స్‌ పనులను మరో 6నెలల్లోగా పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా వందపడకల దవాఖానను నిర్మించి వైద్యపరమైన అన్ని రకాల సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రాంత ప్రజలకు భరోసానిచ్చారు. వంద పడకల దవాఖాన ప్రారంభమైతే అన్నిరకాల వైద్య సేవలకు వైద్యులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని ఇంద్రనగర్‌ కాలనీకి చెందిన పాండు కుమారుడు వెంకటపవన్‌కు విజయవాడలోని సిద్ధార్థ్థ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు లభించింది. విద్యార్థి తండ్రి నుంచి విషయం తెలుసుకున్న 1987 పదో తరగతి బ్యాచ్‌ మిత్రులు సేకరించిన రూ.లక్షను మంగళవారం విప్‌ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం, వైస్‌ చైర్మన్‌ రాజు ఆర్డీవో పాండు, తాసిల్దార్‌ చంద్రశేఖర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo