బుధవారం 03 మార్చి 2021
Nagarkurnool - Jan 25, 2021 , 00:30:21

పోటాపోటీగా జాతీయ స్థాయి టోర్నీ

పోటాపోటీగా జాతీయ స్థాయి టోర్నీ

అచ్చంపేట రూరల్‌, జనవరి 24: పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నీ  పోటాపోటీగా సాగుతున్నాయి. ఆదివారం మొదటి మ్యాచ్‌లో మన్నెవారిపల్లి వర్సెస్‌ ఎస్‌కే  వారియర్స్‌ పోటీలో ఎస్‌కే వారియర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకుని 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ తీసుకున్న మన్నెవారిపల్లి జట్టు 14 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 167 పరుగులతో విజయం సాధించారు. మ్యాచ్‌లో ప్రతిభ కనబర్చిన జిత్తుకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందజేశారు. రెండో మ్యాచ్‌లో ఒంగోలు వర్సెస్‌ అర్ఫాన్‌ సీసీ పోటీలో ఒంగోలు సీసీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని 19.1 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌట్‌ కాగా అర్ఫాన్‌ సీసీ 19 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి విజయం సాధించారు. మ్యాచ్‌లో బౌలర్‌ శేఖర్‌ 12పరుగులతో సరిపెట్టి 3వికెట్లు తీసుకోవడంతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ను అందజేశారు. మొదటి మ్యాచ్‌ విజేత మన్నెవారిపల్లి, ద్వితీయ మ్యాచ్‌ విజేత అర్ఫాన్‌సీసీ జట్లు సోమవారం  ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి.


VIDEOS

logo