శనివారం 06 మార్చి 2021
Nagarkurnool - Jan 23, 2021 , 00:16:41

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

  • సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి, జనవరి 22 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. కడ్తాల మండలం చెన్నంపల్లిలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తూ గ్రామాలు, మండలాలను కలిపే రోడ్లను పూర్తి స్థాయిలో బీటీ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, వైస్‌ ఎంపీపీ అనంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌, కుమార్‌, నారాయణ, లాలయ్య, నర్సింహ, పత్యానాయక్‌, రమేశ్‌, ఖలీల్‌, భాస్కర్‌, వెంకటేశ్‌, చంద్రు, హరిలాల్‌, కేశవులు, కృష్ణ, పరమేశ్‌, నరేందర్‌, వెంకట్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.

బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ 

కల్వకుర్తి, జనవరి 22: కడ్తాల మండలం వేములకుంట తండాకు చెందిన చంద్రు, శంకర్‌కొండ తండాకు చెందిన వాసురాం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సహకారంతో చంద్రుకు రూ.1.25లక్షలు, వాసురాంకి రూ.16వేలు మంజూరయ్యాయి. చెక్కులను బాధితులకు శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, రాములు, హన్మానాయక్‌, శ్రీకాంత్‌రెడ్డి, రమేశ్‌నాయక్‌, వెంకటేశ్‌, నరేశ్‌, చంద్రకాంత్‌, శ్రీశైలం పాల్గొన్నారు.


VIDEOS

logo