శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nagarkurnool - Jan 22, 2021 , 01:15:03

క్షయ వ్యాధిపై అవగాహన

క్షయ వ్యాధిపై అవగాహన

అమ్రాబాద్‌, జనవరి 21:  జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌లాల్‌ ఆదేశానుసారం పదర మండలంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్‌ బీకే, లక్ష్మాపూర్‌ తండాలలో  క్షయ వ్యాధి పై ఇంటింటింకి తిరిగి గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  క్షయ వ్యాధి యాక్టివ్‌ కేస్‌ ఫైండింగ్‌ కార్యక్రమంలో క్షయ వ్యాధి పర్యవేక్షకుడు ఆరిఫ్‌ఖాన్‌, ఆరోగ్య సిబ్బంది క్షయ వ్యాధి లక్షణాలు జ్వరం, రెండు వారాలకు మించి దగ్గు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, తెమడ పడటం వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. దీర్ఘకాలిక రోగులకు, వృద్దులకు, చిన్న పిల్లలు సుమారుగా 1087 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా 50 మంది క్షయ లక్షణాలున్న వారి తెమడ సేకరించి ట్రూనాట్‌ పరీక్ష కోసం పంపించినట్లు వారు తెలిపారు. వ్యాధి నిర్దారణ జరిగితే 6 నెలల పాటు ఉచిత చికిత్సతోపాటు నిక్షయ్‌ పోషక యోజన స్కీం ద్వారా క్షయ రోగులకు పౌష్టికాహారం కోసం నెలకు రూ.5 వందలు ఇవ్వనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో క్షయ పర్యవేక్షకుడు శరత్‌బాబు, ఎంపీహెచ్‌ఈవో బిక్కులాల్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ రెడ్యా, హెల్త్‌ అసిస్టెంట్లు కృష్ణ, మురళీధర్‌ మంగమ్మ, ఆశ కార్యకర్తలు  పాల్గొన్నారు.


VIDEOS

logo