గురువారం 04 మార్చి 2021
Nagarkurnool - Jan 19, 2021 , 01:51:21

టీకా.. ఎంచక్కా

టీకా.. ఎంచక్కా

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
  • 1509 మందికి టీకా.. 
  • పర్యవేక్షించిన జిల్లా అధికారులు
  • మహబూబ్ నగర్ లో అత్యధికంగా 550 మందికి

నాగర్‌కర్నూల్‌, జనవరి 18 (నమస్తే తె లంగాణ), మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ/వనపర్తి గాంధీచౌక్‌/గద్వాల/నారాయణపేట టౌన్‌ : కరోనా టీకా కోసం వైద్య సిబ్బంది క్యూ కడుతున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 కేంద్రాల్లో 550 మందికి, జోగుళాంబ గద్వాలలో 5 సెంటర్లలో 290, నాగర్‌కర్నూల్‌లో 8 చోట్ల 302, నారాయణపేటలో 3 కేంద్రా ల్లో 160, వనపర్తి జిల్లాలో 5 చోట్ల 207 మందికి సోమవారం టీకా వేశారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, దవాఖాన శా నిటేషన్‌ సిబ్బంది, అంగన్‌వాడీలకు వ్యాక్సి న్‌ ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని అరగంటపాటు అబ్జర్వేషన్‌ గదిలో ఉంచిన తరువాత డిశ్చార్జి చేశారు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖానలో స్టాఫ్‌ నర్సు కండ్లు తిరిగి పడిపోగా వైద్యులు పరీక్షించారు. విశ్రాంతి తీసుకున్న తరువాత ఆమెను డిశ్చార్జి చేశారు. ఎక్కడా అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఉదయం 9 నుంచి సాయం త్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్‌ కొనసాగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దవాఖానలో మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, అడిషనల్‌ డీఎంహెచ్‌వో శశికాంత్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శంకర్‌ టీకా ప్రక్రియను పర్యవేక్షించారు. వనపర్తిలో డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, సూపరింటెండెంట్‌ హరీశ్‌, ఆర్‌ఎంవో చైతన్యగౌడ్‌ పరిశీలించారు. 

VIDEOS

logo