రైతులను ప్రోత్సహించేందుకే..

- బండలాగుడు పోటీలు
- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
పెద్దకొత్తపల్లి, జనవరి 16: రైతులను ప్రోత్సహించేందుకే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉత్సాహంగా ఎద్దులతో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దకారుపాముల గ్రామంలో ఫ్రెండ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను నిర్వహించారు. జెడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు ప్రత్యేక పూజలు చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన ఎద్దుల యజమానులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కర్నూలు జిల్లాకు చెందిన రాంభూపాల్‌రెడ్డి ఎద్దులు రూ.50వేలు, రెండో బహుమతి కర్నూలు జిల్లాకు చెందిన సాంకేత్రెడ్డి ఎద్దులు రూ.40వేలు, మూడో బహుమతి గద్వాల జిల్లాకు చెందిన సుధాకర్‌రెడ్డి ఎద్దులు రూ.30వేలు, నాలుగో బహుమతి గద్వాల జిల్లాకు చెందిన బాలస్వామి ఎద్దులు రూ.20వేలు అందుకు న్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సివిల్ దవాఖాన కమిటీ చైర్మన్ జంబులయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉప సర్పంచ్ ఎల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాసులు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పిడకలతో హవనం చేస్తే.. ఇంటిని 12 గంటలు శానిటైజ్ చేసినట్లే
- అసమాన ప్రతిభ మహిళల సొంతం: మంత్రి ఎర్రబెల్లి
- ప్రపంచ కుబేరుడిని వదిలి స్కూల్ టీచర్‌ను పెళ్లి చేసుకుంది!
- వనపర్తి జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య
- జాన్వీ టాలీవుడ్ డెబ్యూపై స్పందించిన బోని కపూర్
- శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
- బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చచ్చిపోవాలని అనిపించేది: మేఘన్
- హై ఫిల్టర్ మాస్క్‌లో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ నరేంద్ర
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్
- కుమారుడిని పరిచయం చేసిన కరీనా