డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన

నాగర్‌కర్నూల్ టౌన్, జనవరి 16: మండలంలోని పెద్దముద్దునూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్బీ ఏఈ మహేశ్‌ను ఆదేశించారు. త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం రైతు వేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, రైతుబంధు సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ స్వామి, కురుమూర్తి ఉన్నారు.
యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
తిమ్మాజిపేట, జనవరి 16 : మండల కేంద్రంలో గతేడాది విద్యుత్‌షాక్‌తో రెండు చేతులు, కాలు కోల్పోయిన కరీముల్లా అనే యువకుడిని శనివారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం రూ.10వేలు ఆర్థికసాయం చేశారు. అంతకుముందు అప్పాజిపల్లిలో మృతి చెందిన విండో వైస్ చైర్మన్ రాందేవ్‌రెడ్డి సోదరుడు మాధవరెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, సర్పంచులు వేణుగోపాల్‌గౌడ్, తిరుపతమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు స్వామి, ఎంపీటీసీ లీలావతి, రైతుబంధు కన్వీనర్ వెంకటస్వామి, మార్కెట్ డైరెక్టర్ హుస్సేని ఉన్నారు.
తాజావార్తలు
- గొలుసుకట్టు మోసం.. 24 మంది అరెస్టు
- ట్విట్టర్లో మహిళలు ఏం పోస్ట్ చేస్తున్నారంటే..?
- చిన్నారి రవిని ఆదుకుందాం.. అతనికి నిండైన ఆరోగ్యాన్నిద్దాం
- పులితో పరాచాకాలు ఆడుతున్న విజయ్ హీరోయిన్
- కోతులకు కల్లు ప్యాకెట్ దొరికితే ఊరుకుంటాయా.. ఓ పట్టుపట్టేశాయ్: వీడియో
- ఒక్కరోజే 15 లక్షల మందికి టీకాలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు