శుక్రవారం 05 మార్చి 2021
Nagarkurnool - Jan 17, 2021 , 00:39:11

నాగర్‌కర్నూల్‌లో తొలిరోజు 60 మందికి..

నాగర్‌కర్నూల్‌లో తొలిరోజు 60 మందికి..

నాగర్‌కర్నూల్‌, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తొలి రోజు 60 మం దికి టీకావేశారు. రెండు రోజుల కిందట మహబూబ్‌నగర్‌ నుంచి జిల్లాకు చేరిన వ్యాక్సిన్‌ను ముందు రోజు జిల్లాలోని తిమ్మాజిపేట, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన కేం ద్రాలకు చేరవేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచన మేర కు తొలిరోజు ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున టీ కా ఇచ్చారు. ఈనెల 20వ తేదీలోగా జిల్లాలోని కరో నా వారియర్లు 4,963 మందికి వ్యాక్సినేషన్‌ పూ ర్తి చేయనున్నారు. కాగా, శనివారం తిమ్మాజిపే ట పీహెచ్‌సీలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్ట ర్‌ శర్మన్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తిమ్మాజిపేటలో స్టాఫ్‌ న ర్సు ప్రమీలకు, కల్వకుర్తిలో ల్యాబ్‌ అసిస్టెంట్‌ సత్యంకు తొలి వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ వేయించుకు న్న సిబ్బందితో నా యకులు, అధికారులు మాట్లాడారు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఎలా అనిపించింది..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నా యకులు, అధికారులు మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై ప్రజలు భ యాందోళనలు వీడాలన్నారు. తలనొప్పి, జ్వరం వంటి చిన్న స మస్యలు మాత్రమే వస్తాయన్నారు. వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ తర్వాత ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం ప్రజలందరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వై ద్యరంగంలో తెలంగాణ మరింత పురోగమిస్తుందన్నారు. కార్యక్రమా ల్లో అదనపు కలెక్టర్‌ మనుచౌదరి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసిం గ్‌ ఠాకూర్‌, జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌, డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, డీఈవో గోవిందరాజులు, డీపీవో రాజేశ్వరి, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి, కల్వకుర్తి, తిమ్మాజిపేట మం డలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

VIDEOS

logo