బుధవారం 27 జనవరి 2021
Nagarkurnool - Jan 14, 2021 , 00:35:05

కమనీయం.. గోదాదేవి కల్యాణం

కమనీయం.. గోదాదేవి కల్యాణం

  • తరలివచ్చిన భక్తులు
  • పాల్గొన్న ఎమ్మెల్యే బీరం దంపతులు, ప్రజాప్రతినిధులు

కొల్లాపూర్‌, జనవరి 13: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని రామాలయం, మాధవస్వామి ఆయాల్లో గోదాదేవి కల్యాణోత్సవం మంగళవాయిద్యాలు,  వేదమంత్రాల మధ్య బుధవారం కనులపండువగా నిర్వహించారు. పట్టణంలోని ఆయా ఆలయాల్లో స్వాములవారి కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సతీమణి  విజయమ్మ హాజరై పూజించారు. ఎమ్మెల్యేకు ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కల్యాణోత్సవం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. కల్యాణోత్సవానికి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మతీన్‌అహ్మద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కౌన్సిలర్లు కృష్ణ, రాముడుయాదవ్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు  పాల్గొన్నారు.

రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు విరాళం

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిధిసమర్పణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు బీరం బిచ్చమ్మ, లక్ష్మారెడ్డి స్థానిక ట్రస్ట్‌ కార్యకర్తలకు రూ.2లక్షల విరాళం అందజేశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు రూ.లక్షా116అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచారక్‌ శివశంకర్‌,  భాస్కర్‌రెడ్డి, సుదర్శన్‌శెట్టి, ఉపేందర్‌, బాలయ్య, కృష్ణప్రసాద్‌, వెంకటస్వామిగౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.logo