శనివారం 06 మార్చి 2021
Nagarkurnool - Jan 14, 2021 , 00:35:05

భోగభాగ్యాల భోగి

భోగభాగ్యాల భోగి

కొల్లాపూర్‌, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం పల్లెల్లో పండుగ శోభ సంతరించుకుంది. పల్లెలకు ఆడపడుచులు పిల్లాపాపలతో చేరుకోవడంతో సందడిగా మారాయి. తెలంగాణ జాగృతి  జాగృతి జిల్లా కన్వీనర్‌ పావని, మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు భోగి మంటలను వేశారు. అలాగే పట్టణంలోని 20వ వార్డులో చంద్రశేఖరాచారి ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. 

అమ్రాబాద్‌, పదరలో..

అమ్రాబాద్‌, జనవరి 13: సంక్రాంతి సంబురాల్లో భాగంగా బుధవారం అమ్రాబాద్‌, పదర మండలాల్లో ప్రజ లు భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే భోగి మంటలు వేసుకును కాచుకున్నారు. 

అచ్చంపేటలో..

అచ్చంపేట రూరల్‌, జనవరి 13: సంక్రాంతి సంబరాల్లో భాగంగా పద్మశాలీలు భోగి మంటలు వేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో పద్మశాలీలు ఇంటి ఎదుట భోగి మంటలను వేసుకుని చుట్టూ తిరిగారు. ఈ సందర్భంగా భోగి ప్రత్యేకతను గుర్తు చేసుకున్నారు. 

శ్రీశైలంలో సంబరాలు

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అమంగళాలను తొలగించి భోగభాగ్యాలను అందించే భోగి మంటలతో సంప్రదాయ ఘట్టంతో బుధవారం తెల్లవారుజాము నుంచి మూడోరోజు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జునస్వామి రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 


VIDEOS

logo