మంగళవారం 09 మార్చి 2021
Nagarkurnool - Jan 14, 2021 , 00:35:03

క్రీడల్లో యువత రాణించాలి

 క్రీడల్లో యువత  రాణించాలి

  •  ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి, జనవరి 13: గ్రామాల్లో నిర్వహించే క్రీడల్లో యువత రాణిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. కల్వకుర్తి మండలం ఎంగంపల్లిలో వాలీబాల్‌, కుర్మిద్దలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్‌ను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యంతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ సునీత, మార్కెట్‌ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, కాటన్‌మిల్‌ వర్కింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు, సర్పంచ్‌ యాదగిరిరెడ్డి, ఉపసర్పంచ్‌ రవీందర్‌, ఎంపీటీసీ సంతోష, శోభ శేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌, మనోహర్‌రెడ్డి, కొండారెడ్డి, దామోదర్‌గౌడ్‌, రామస్వామి, లక్ష్మయ్య పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

వెల్దండ, జనవరి 13: మండలంలోని కొట్ర గ్రామానికి చెందిన కృష్ణయ్య సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే సహకారంతో రూ.24వేలు మంజురయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే మండల కేంద్రంలో బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, నాయకులు గోపాల్‌నాయక్‌, కిరణ్‌, సుభాశ్‌ తిరుపతయ్య, రమేశ్‌  తదితరులు ఉన్నారు.


VIDEOS

logo