నేటి నుంచి ప్రత్యేక ఓటరు నమోదు

- ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి
- 6,7 తేదీల్లో స్పెషల్ డ్రైవ్
- తాసిల్దార్లతో వీసీలో కలెక్టర్ శర్మన్
నాగర్‌కర్నూల్ టౌన్: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, రాజకీయ నాయకులతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శర్మన్ సూచించారు. నమోదు అనంతరం జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటుహక్కును పొందేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు నేలా పోలింగ్స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని క లెక్టర్ ఆదేశించారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం నుంచి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై అదనపు క లెక్టర్ హన్మంత్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్‌తో కలిసి తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శని, ఆదివారాల్లో జిల్లా వ్యా ప్తంగా ఉన్న 792 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమో దు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాసిల్దార్లకు పిలుపునిచ్చారు. ఓటరు నమోదుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు.
నవంబర్ 16వ తేదీ నాటికి జిల్లాలోని నాలుగు నియోజకవర్గా ల్లో 6లక్షల 63వేల 982మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో 3లక్షల 29వేల 586మంది మహిళా ఓటర్లు కాగా 3లక్షల 34వే ల 390మంది పురుష ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా నమోదు కోసం శని, ఆదివారాల్లో జిల్లాలోని 792 పోలింగ్ కేంద్రంలో బీఎల్వోల సమక్షంలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. బీఎల్వోలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ బూత్‌లలో విధిగా ఉండాలని, చనిపోయిన వారి ఓట్లను తొలగించాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా రెండు రోజులపాటు పోలింగ్ కేంద్రాలను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని కలెక్టర్ వెల్లడించారు. వీసీలో నాగర్‌కర్నూల్ ఆర్డీవో నాగలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ ఖాజా, కలెక్టరేట్ సిబ్బంది అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు తాసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.
తాజావార్తలు
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్‌గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు