గురువారం 28 జనవరి 2021
Nagarkurnool - Dec 05, 2020 , 01:19:49

రోగులకు మెరుగైన సేవలందించాలి

రోగులకు మెరుగైన సేవలందించాలి

  • కల్వకుర్తి సర్కారు దవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్‌ 

కల్వకుర్తి రూరల్‌ : సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన సేవలందించి మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్‌ శర్మన్‌ వైద్య సిబ్బందికి సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానను కలెక్టర్‌ శర్మన్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు సేవలు చక్కగా అందింస్తుండంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 


logo