గురువారం 21 జనవరి 2021
Nagarkurnool - Dec 05, 2020 , 01:19:46

పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించాలి

పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించాలి

  • పత్రాలు లేవని రైతులను వెనక్కి పంపకండి
  • మిల్లుల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..
  • కల్వకుర్తి ఊర్కొండ మండలాల్లోని కాటన్‌ మిల్లుల సందర్శన

కల్వకుర్తి: మిల్లుల వద్దకు పత్తిని విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సీసీఐ, అధికారులకు కలెక్టర్‌ సూచించారు. కల్వకుర్తి మండలం సత్యసాయినగర్‌ కాలనీ సమీపంలో తిరుమల జిన్నింగ్‌ కాటన్‌ మిల్లు, ఊర్కొండ మండలంలోని మిల్లులను ఆయన సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పత్తి సాగుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను రైతులకు ఏఈవోలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలు లేకపోయిన సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని.. రైతులను వెనక్కి పంపొద్దని ఆయన సూచించారు.

ఆ పత్రాలను మరుసటి రోజు తీసుకొచ్చి అధికారులకు అందించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా.. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలియజేశారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్‌కుమార్‌, తాసిల్దార్‌ రాంరెడ్డి, సీసీఐ అధికారులు తదితరులు ఉన్నారు.logo