బుధవారం 20 జనవరి 2021
Nagarkurnool - Dec 03, 2020 , 02:13:10

స్వయం ఉపాధి రుణాలకు చివరి అవకాశం

స్వయం ఉపాధి రుణాలకు చివరి అవకాశం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: 2018-19 ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద స్వయం ఉపాధి పొందేందుకు ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఎంపీడీవో లేదా మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఓబీఎంఎంఎస్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా పంపాలని షెడ్యూల్‌ కులాల కార్య నిర్వహణ అధికారి మధుసూదన్‌నాయక్‌ తెలిపారు. మండలస్థాయిలో గతంలో జరిగిన లబ్ధిదారుల ఎంపిక శిబిరంలో పాల్గొన్న వారు బ్యాంకు సమ్మతితో దరఖాస్తు ఫారాలను అందజేయాలని సూచించారు. ఈనెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పంపాలని, లేని పక్షంలో సబ్సిడీ రుణాల కోసం 2020-21 కార్యాచరణ ప్రణాళిక కింద పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. logo