మంగళవారం 09 మార్చి 2021
Nagarkurnool - Dec 02, 2020 , 06:28:35

పేదలకు సర్కారు అండ

పేదలకు సర్కారు అండ

  •  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కశిరెడ్డి

కల్వకుర్తి: పేద కుటుంబాలకు ఆపద సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వేళల్లో అండగా ఉంటుందని శాసనమండలి సభ్యుడు కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం జంగారెడ్డి గ్రామానికి చెందిన ఈశ్వర్‌ అనారోగ్యానికి గురై వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఈశ్వర్‌  వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ. 34 వేలు మంజూరయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి చెక్కును ఈశ్వర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, శ్రీశైలం, వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీను, రంగయ్య, ముబీన్‌, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo