గురువారం 28 జనవరి 2021
Nagarkurnool - Dec 01, 2020 , 06:04:00

విద్యుత్‌ కోతతో ‘ఆన్‌లైన్‌' కష్టాలు

విద్యుత్‌ కోతతో ‘ఆన్‌లైన్‌' కష్టాలు

తెలకపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో తరచూ విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైతులతోపాటు ఆన్‌లైన్‌ తరగతులకు ఆటంకం కలుగుతున్నది. ఇండ్లల్లో టీవీలు, కంప్యూటర్లలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు పాఠాలు వీక్షించలేకపోతున్నారు. ఫలితంగా మండలం ఆన్‌లైన్‌ విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుమార్లు విద్యుత్‌ అధికారులకు వివరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.


logo