గురువారం 28 జనవరి 2021
Nagarkurnool - Dec 01, 2020 , 06:03:57

ఉచితంగా నట్టల నివారణ మందులు

ఉచితంగా నట్టల నివారణ మందులు

  • నేటి నుంచి 7 వరకు పంపిణీ
  • జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లాలో మంగళవారం నుంచి 7వ తేదీ వరకు జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప పేర్కొన్నారు. జిల్లాలోని పశువైద్య సిబ్బందిని 45 బృందాలుగా ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నేటి నుంచి.. 

తిమ్మాజిపేట: మండలంలో మంగళవారం నుంచి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయనున్నట్లు పశువైద్యాధికారిణి శ్రావణి తెలిపారు. నేటి నుంచి 8 వరకు అన్ని గ్రామాలు, తండాల్లో జీవాలకు మందులు వేయనున్నట్లు ఆమె తెలిపారు. ఒకటిన తిమ్మాజిపేట, మరికల్‌, సూర్యనాయక్‌తండా, గొరిట, ఆర్‌సితండాల్లో, 2వ తేదీన గుమ్మకొండ, మాన్యానాయక్‌తండా, చేగుంట, ఆవంచలో, 3వ తేదీన అప్పాజిపల్లి, పుల్లగిరి, బాజీపూర్‌, బుద్ధసముద్రంలో, 4వ తేదీన కోడుపర్తి, ఇప్పలపల్లి, హనుమాన్‌తండా, లక్ష్మానాయక్‌తండా, నేరళ్లపల్లిలో, 5వ తేదీన బావాజీపల్లి, పోతిరెడ్డిపల్లి, వెంకాయపల్లి, మారేపల్లిలో, 7వ తేదీన ఎదిరేపల్లి, తుమ్మకుంట, చంద్రాయన్‌పల్లి, అమ్మపల్లిలో, 8వ తేదీన ఎక్కడైనా టీకాలు వేయని జీవాలకు వేయనున్నట్లు తెలిపారు. గొర్రెల కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తాజావార్తలు


logo