ఘనంగా ఆకాశ దీపోత్సవం

- సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు
నాగర్‌కర్నూల్ టౌన్: జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో దీపారాధన, దీపదానం, ఆకాశ దీపోత్సవం, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విష్ణు సహస్ర పారాయణ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో దంపతులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ దీపారాధన కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం నిత్య విష్ణు సహస్ర పారాయణ కమిటీ భక్తులు భజనలు చేశారు. దీక్షాపరులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దీపోత్సవం అనంతరం సహస్ర పారాయణం నిర్వహించారు.
ఆలయాలకు కార్తీక శోభ
కందనూలు: సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. మండలంలోని శ్రీపురం, తూడుకుర్తి, నాగనూలు, ఎండబెట్ల గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ప్రాంతఃకాలం నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించి కోర్కెలు కోరుకున్నారు. మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో దీపాలు వెలిగించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
తిమ్మాజిపేట మండలంలో..
తిమ్మాజిపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సాయంత్రం వేళలో ఆలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. పలువురు తమ ఇండ్ల వద్ద తులసి పూజలు చేశారు.
తెలకపల్లిలో..
తెలకపల్లి: మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకొన్నారు. పలు శివాలయాల్లో మహిళలు పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఘడియలు ఉండటంతో రెండు రోజుల పాటు ప్రజలు నోములు, వ్రతాలను ఆచరించారు.
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ సహా పలు గ్రామాల్లో కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమశివుడికి పంచామృతాభిషేకం, అర్చనలు చేశారు. సాయంత్రం శివాలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో వడ్డెమాన్ అర్చకులు విశ్వనాథశాస్త్రి, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతాలు
బిజినేపల్లి : మండలంలోని పాలెం గ్రామంలో కొలువైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సత్యనారాయణస్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు 71 వ్రతాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
తాజావార్తలు
- బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమ్మగడ్డ నిద్రపోయాడు
- మాడ్రన్ మార్కెట్ కోసం స్థలాన్ని కేటాయించండి
- స్మారకంగా జయలలిత ఇల్లు.. ఆవిష్కరించిన సీఎం పళని
- తైవాన్‌కు స్వతంత్రం అంటే యుద్ధమే.. చైనా స్ట్రాంగ్ వార్నింగ్
- ఆరో పెండ్లి : ఈసారి బాడీగార్డ్‌తో..
- డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు
- జాన్వీకపూర్ కు 'వర్క్ ఫ్రమ్ హోం ' నచ్చలేదా..?
- గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..