అర్హులు ఓటు నమోదు చేసుకోవాలి

- జనవరి 15న తుది జాబితా విడుదల
- కలెక్టర్ శర్మన్ చౌహాన్
నాగర్కర్నూల్ టౌన్: జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటుహక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించే వాల్పోస్టర్ను అదనపు కలెక్టర్ మనుచౌదరి, డీఆర్వో మధుసూదన్నాయక్లతో కలిసి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, రివిజన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దేశంలో ఆరు నెలలపాటు ఎక్కడ స్థిర నివాసం ఉంటారో అక్కడే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందన్నారు.
2021 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటుహక్కు పొందేందుకు జిల్లాలోని గ్రామ, వార్డు, తాసిల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా ఓటరు జాబితాను రూపొందిస్తున్నామని, కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డులు, పోలింగ్ కేంద్రాల్లో ఉన్నా సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఇందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనవరి 15వ తేదీ నాటికి తుది జాబితాను ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఆహా..
- పక్షులకు గింజలు వేసిన ధావన్..విచారణకు డీఎం ఆదేశం
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య