ఆదివారం 24 జనవరి 2021
Nagarkurnool - Nov 28, 2020 , 02:43:50

సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం

సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం

  • ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకుల ధర్నా 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: కేంద్ర ప్రభుత్వం తన అధికార బలంతో దేశానికే నవరత్నాల్లాంటి బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వేబుక్‌ కర్మాగారాలు లాంటి సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని అభివృద్ధి చేయకుండా కార్పొరేట్‌ శక్తులను అభివృద్ధి చేస్తున్నాడని విమర్శించారు. దేశానికి సగం ఆదాయం తెచ్చే రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ లాంటి సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పడం మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దం పట్టినట్లు అర్థమవుతుందన్నారు.

మోడీ ఆరేండ్ల పాలనలో కార్పొరేట్‌ శక్తులకు గులాం చేయడం తప్ప పేద ప్రజానీకానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తమ విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్‌లో ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో సీపీఎం నాయకులు అశోక్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, భానుప్రకాశ్‌, మనోహర్‌, నరహరి, హరి తదితరులు పాల్గొన్నారు. logo