శనివారం 23 జనవరి 2021
Nagarkurnool - Nov 26, 2020 , 02:19:19

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

  • ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి: పేదలకు అన్ని వేళల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి మండలం జిల్లెళ్ళ గ్రామానికి చెందిన రాములు అనారోగ్యానికి గురై వైద్య సహాయం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్సీ కశిరెడ్డి సహకారంతో రాములు వైద్యం కోసం రూ.20 వేలు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కశిరెడ్డి అందజేయగా బాధితుడి తరఫున మాజీ సర్పంచ్‌ జిల్లెళ్ళ రాములు అందుకున్నారు. 


logo