గురువారం 28 జనవరి 2021
Nagarkurnool - Nov 26, 2020 , 02:19:16

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కల్వకుర్తి రూరల్‌: రోజురోజుకూ విస్తరిస్తున్న కొవిడ్‌-19పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీడిపల్లి సర్పంచ్‌ కల్పన సూచించారు. కల్వకుర్తి మండలం జీడిపల్లితోపాటు వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామ కూడళ్ల వద్ద బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఖాజా, కార్యదర్శి దీప తదితరులు ఉన్నారు.logo