శుక్రవారం 22 జనవరి 2021
Nagarkurnool - Nov 26, 2020 , 02:02:39

ఆదర్శ వివాహం

ఆదర్శ వివాహం

  • అనాథను పెండ్లి చేసుకున్న యువకుడు
  • హాజరైన కలెక్టర్‌ శర్మన్‌ చౌహాన్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : ఆశ్రమంలో అనాథగా పెరుగుతున్న అమ్మాయిని ఓ యువకుడు ఆదర్శ వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న జ్ఞానేశ్వర వాత్సల్య మందిరంలో అనాథగా పెరిగిన నర్మద ఇంటర్‌ పూర్తి చేసుకున్నది. తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన కాంశెట్టి మణెమ్మ, కృష్ణయ్యల ద్వితీయ పుత్రుడు పాండు నర్మదను పెండ్లి చేసుకున్నాడు. జిల్లా కేంద్రం సమీపంలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో ఆశ్రమం అధ్యక్షుడు ఆకారపు విశ్వనాథం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9:10 గం టలకు వివాహ వేడుకలు నిర్వహించారు. పెండ్లికి కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌ హాజరై దంపతులకు నూతన వస్ర్తాలు అందజేసి ఆశీర్వదించాడు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ జిల్లా అధికారులు, ఆశ్రమం అధ్యక్షుడు ఆకారపు విశ్వనాథం, వార్డెన్‌ రామానంద, రవికుమార్‌, శివశంకర్‌, పాండురంగయ్య, నరహరి, బాలస్వామి, పురప్రముఖులు పాల్గొన్నారు. 


logo