శనివారం 23 జనవరి 2021
Nagarkurnool - Nov 23, 2020 , 02:47:57

భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన

భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో కార్తీకమాస వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక దీపారాధన, ఆకాశ దీపోత్సవం, ప్రత్యేక పూజలను భక్తులు భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. రామాలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్‌ అయ్యంగార్‌ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు కార్తీకమాసం విశిష్టతను వివరించారు. ఈమాసంలో భక్తులు దీపారాధన, ఆకాశ దీపోత్సవం, దీపదానం, సాలగ్రామ దానం, వస్త్రదానం, అన్నదానం, భూదానం, గోదానం, వంటివి విరివిగా చేస్తుంటారన్నారు. ఈ విధంగా చేయడం వల్ల పుణ్యం లభిస్తుందన్నారు.  ప్రాతఃకాలంలోనే పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు, సీతారామచంద్రస్వామికి కుంకుమార్చనలు, సాయంత్రం వేళలో ఆకాశదీపం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.logo