శనివారం 28 నవంబర్ 2020
Nagarkurnool - Nov 22, 2020 , 01:37:46

గర్భిణులకు 102 ఆరోగ్య సేవలు

గర్భిణులకు 102 ఆరోగ్య సేవలు

బిజినేపల్లి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 102 రవాణా ఆరోగ్య సేవలు శనివారం మండలంలోని లట్టుపల్లి పీహెచ్‌సీ  పరిధిలోని మంగనూరు గ్రామంలో శనివారం నిర్వహించా రు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజేశ్‌గౌడ్‌ గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు 102 వాహన ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. బాలింత సంరక్షణ సమయంలో ఆరోగ్య పరీక్షలకు, నవజాత శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడానికి ఉచిత రవాణా సేవలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుచరిత, మహ్మద్‌ ఖలీల్‌, యాదగిరి, జ్యోతి, కృష్ణవేణి, బాలమణి, అనిత, పద్మ, నాగమ్మ ఉన్నారు.