మంగళవారం 01 డిసెంబర్ 2020
Nagarkurnool - Nov 22, 2020 , 01:37:43

గ్రేటర్‌ ప్రచారంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బిజీ..

  గ్రేటర్‌ ప్రచారంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బిజీ..

కల్వకుర్తి/వెల్దండ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా గోల్నాక, జియాగూడ డివిజన్‌ ఇన్‌చార్జీలుగా నియమితులైన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తు న్నారు. శనివారం టీఆర్‌ఎస్‌ నాయకులు గోళి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ గోల్నాకలో విస్త్రృతంగా ప్రచారం నిర్వహించారు.

అదే విధంగా జియాగూడలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 82 డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన లక్ష్మీ ప్రసన్నతో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, కాలేరు వెంకటేశ్‌, గోళి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడి నామినేషన్‌ను ఉపసంహరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌ సీఎం ఆయ్యాక తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బృహత్తర పథకాలతో సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఎంతో మేలు చేశాడన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా  బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆఖండ విజయం ఖాయమని ఆయన తెలిపారు.